
శ్రీ జాతి ఆణిముత్యం
రోదసీలో ధీర వనిత
అంతర్జాతీయ వ్యోమగామి
విలియమ్స్ సునీత
అవనీ తలానికి నేడు రాక
జగదేక ప్రజలు ఆమెకి
పలుకుతున్నారు..సాదర స్వాగతం…
చుక్కల తోటలో చక్కగా తిరిగి
చందమామలోని చిదంబర రహస్యాలు చేజిక్కించుకొని ధరణికి ఆగమనం…
తొమ్మిది నెలలు క్రితం సునీత
నాసా కేంద్రం నుంచి ఆకాశంలోకి
పక్షి ఎగిరేను పరిశోధనలు కోసం…
నవ నెలలు పాటు…నింగిలో
అల్పాహారాలే..ఆమెకి ఆహారాలు
శూన్యాకాశంలో డేగ కళ్లతో సంచరించి చంద్రమండలం నుంచి భూమండలంకి రాక…
పరదేశంలో మనం పది రోజులు ఉంటే.. మాతృదేశం మీద మమకారం పుడుతుంది.
వేనవేల మైళ్ల దూరంలో ఉన్న రోదసిలోకి వెళ్లి తొమ్మిది మాసాలు మీరు ఉన్నారంటే…ఔరా…మీ ఓర్పుకి, నేర్పూకీ జోహార్లు…
మీరు…చాలా గొప్పవారు..
గగనం కన్న విశాలత్వం ఉన్నవారు…
నీలాకాశంలోని… మీ సాహస కృత్యానికి ఏడు వందల కోట్ల మంది ప్రజలు తమ శిరసులు వొంచుతూ మీకు సాదర స్వాగతం పలుకుతున్నారు…..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
