తేదీ : 10/01/ 2025.
ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నందు తెల్లవారుజామున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది. ప్రజలందరకు భోగి , సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరి కుటుంబం లో సిరిసంపదలు, సంతోషం కలిగి ఎవరికి ఎటువంటి అనారోగ్యం, కష్టనష్టాలు రాకుండా ఉండాలి అని భక్తులు చెప్పడం జరిగింది.
గుడికి వచ్చిన వారందరు పులిహార, ప్రసాదం స్వీకరించారు. దేవుడికి హారతి ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి వారు మొక్కుకున్న మొక్కులను చెల్లించారు. ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి దంపతులు, మరియు మిట్టపల్లి వెంకటేశ్వరరావు, దంపతులు నీరజ, కుమారుడు చెన్నారావు , కోడలు శైలజ, మనవడు హర్ష , పూజారి, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి లోటు పాట్లు రాకుండా చూసుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App