TRINETHRAM NEWS

తేదీ: 03/01/2025.
ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు.

ఎన్టీఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట
మండలంలో మైలవరం మీదగా రెడ్డిగూడెం వెళ్లు రోడ్డు మార్గంలో ఉన్నటువంటి శ్రీ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బహుజన ఐక్యవేదిక సంఘం వాళ్లు పూల మాలలు ఏసి జోహార్లు
అని నినాదాలు తెలపడం జరిగింది. సంఘం పెద్దలందరూ కూడా ప్రజలందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ప్రజలకు చేసిన సేవ గురించి సంఘం పెద్దలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, సంఘం పెద్దలు జై భీమ్ అంటూ నినాదాలు చేసినారు. బహుజన ఐక్యవేదిక సంఘం అధ్యక్షులు , మరియు సంఘం పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App