
పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
కొత్తగూడెం రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేనల్లుడు, ఖమ్మం క్యాంప్ కార్యాలయం ఇంచార్జి తుంబూరు దయాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు పాల్వంచలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయం, నాగారం ఎస్సి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, డీసీఎంస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్ తో కలసి కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ పుట్టినరోజు వేడుకలకు పాల్వంచ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకలరంగారావు, పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండo.వెంకన్న, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్రంశెట్టి. ముత్తయ్య, లక్ష్మిదేవిపల్లి మండల ఓబీసీ అధ్యక్షులు వీరబాబు,కాంగ్రెస్ నాయకులు జోషి, ఆవుల.మధు, అనిత,ప్రసాద్, విజయ్,సత్తార్, రాంబాబు, ఉదయ్, నాగరాజు, మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
