TRINETHRAM NEWS

డిండి మండలంలో ప్రారంభమైన గ్రామసభ.

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్

గుండి మండల పరిధిలో 10 గ్రామ పంచాయతీలకు గాను గ్రామసభలు మంగళవారం 21 –01-2025 నాడు నిర్వహించారు.

ఇందులో భాగంగా గోనకల్ గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు చదివి వినిపించారు. రేషన్ కార్డులు 22 మరియు ఇందిరమ్మ ఇండ్లు 26 మంజూరైనాయని తెలిపారు లిస్టులో పేరు లేని వారు తిరిగి అప్లై చేసుకోవాల్సిందిగా అధికారులు గ్రామ ప్రజలకు చెప్పారు.
అర్హులైన వారందరికీ పథకాలు అందుతాయని అధికారులు గ్రామ ప్రజలకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకన్న, జూనియర్ అసిస్టెంట్ వెంకటయ్య, గ్రామ సెక్రెటరీ గీత, మరియు ఏసోబు, నిరంజన్, శైలేష్, రాజు రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App