TRINETHRAM NEWS

జగిత్యాలలో గ్రామ రభస

జగిత్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన గ్రామ సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది , రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల పేర్లు లేకుండా సభ ఎలా నిర్వహిస్తారని, ప్రశ్నించారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిర్వహించిన వార్డు సభలో కాలనీ వాసులు అధికారు లను నిలదీశారు. ఇంది రమ్మ ఇండ్లు, రేషన్‌ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు రాలేదన్నారు.

మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఇప్పటికే మూడు సార్లు చేశామ న్నారు. గతంలో ఇచ్చిన వాటి గురించి చెప్పాలని పట్టుబట్టారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App