TRINETHRAM NEWS

తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు

Trinethram News :ఉపాధ్యాయుడికి హెచ్ఐవీ సోకడంతో తమపై జరుగుతున్న అకృత్యాలను తల్లికి చెప్పిన యువతులు

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన జాటోత్ సునీల్ కుమార్ స్థానిక హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.. అయితే భార్య చనిపోవడంతో మరో మహిళతో 2018 నుండి సహజీవనం చేస్తున్నాడు

సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు

ఈ క్రమంలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు

తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు

ఇటీవల ఆ ప్రబుద్ధుడు వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ సోకినట్లు తేలింది.. ఈ విషయం తెలిసి బాలికలు ఆందోళన చెంది తల్లికి విషయం చెప్పారు

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లికూతుర్లు

దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Government teacher who raped