Government should regularize all the employees who are doing NHM deficiency
నేషనల్ హెల్త్ మిషన్ 510 జీవోలో నష్టం జరిగిన 4000 మంది ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్స్ చేసి బేసిక్ పే వేతనం వెంటనే అమలు చేయాలని, 4000 ఉద్యోగులకు ప్రత్యేక జీవో ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఎన్ హెచ్ ఎం లోపనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలి జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ హెచ్ ఎం అధ్యక్షులు ఎం.నరసింహ డిమాండ్
జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఏస్. బాలసుబ్రమణ్యం
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం)లో గత అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేయుచున్న ఉద్యోగులందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మరియు ఎన్.హెచ్.ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎం. నరసింహ , ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. ఎన్ హెచ్ ఎం రాష్ట్ర కార్యాలయంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎం.
నరసింహ మాట్లాడుతూ ఎన్.హెచ్.ఎం. కాంట్రాక్ట్ పద్దతిన నియమించుకునే సందర్భంలోనే వీరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ఆధారితంగా సెలక్షన్ చేయటం జరిగిందని, కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం పేద ప్రజలకు అండదండగా ఉండి వారి సేవలను అందించి వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టినటువంటి ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంట్రాక్టు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ వేతనం కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాలి అని ఉన్నప్పటికీ వీరికి అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని చట్ట ప్రకారం వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉండగా అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నదని వారు విమర్శించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఇప్పటికీ 10 నెలలు అవుతుంది కావున ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ అందరినీ పర్మనెంట్ అయ్యేందుకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నటువంటి జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులను విస్మరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని వారు తెలియజేశారు.
ఉద్యోగులకు అధిక పనిభారంతో సతమతమవుతున్నారని అన్ని స్థాయిల్లో సరిపడా సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్ పనిచేస్తున్న పద్ధతిని వెంటనే క్రమబద్ధీకరణ చేయాలి, ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులను బేసిక్ వేతనం అమలు పరచాలి , జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులందరికీ 30 శాతం వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రమణ్యం, కొట్టల నీశ్రాంతిని రాష్ట్ర నాయకులు రాష్ట్ర ఆయుష్ అధ్యక్షులు ఎన్. శ్రీనివాస్, కోటేశ్వర్, జలీల్హా, డి.సంధ్య , టీ.శ్వేత , స్రోవంతి, కె.కవిత, జీ.స్రవంతి, సుజాత,సంగీత,డి.జ్యోతి, సావిత్రి మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App