TRINETHRAM NEWS

Government of Telangana Information Civil Relations Department

త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

రాష్ట్రస్థాయి రెవెన్యూ సదస్సు నిర్వహాణ ఏర్పాట్లను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి పరిశీలించి జిల్లాయంత్రాగానికి తగు సూచనలు, సలహాలు తెలిపారు.
శామీర్ పేట లోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నరాష్ట్రస్థాయి రెవెన్యూ సదస్సుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టరు ఆదేశించారు. రాష్ట్రంలోని రెవెన్యూ అంశాల పై అన్ని జిల్లాల రెవెన్యూ సిబ్బందితో తహాసీల్లార్ల స్థాయి వరకు మంత్రి సమావేశము కానున్నారని అందుకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆర్ ఐఈ లకు సూచంచిన విధంగా వారికి కేటాయించిన జిల్లా సిబ్బందిని దగ్గరుండి వారి హాజరు, సీటింగ్ ఏర్పాట్లను చూసుకోవాలన్నారు. ఏర్పాట్లలో ఏలాంట లోపాలు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టరు అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Government of Telangana Information Civil Relations Department