TRINETHRAM NEWS

మంచిర్యాల రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి Jan 19, 2025,

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు విధిగా పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. మంచిర్యాల డీసీపీ కార్యాలయంలోని ఆయన చాంబర్లో డీసీపీతో కలసి రవాణాశాఖ అధికారులు రోడ్డు భద్రత మాసోత్సవాల ప్రచార కర పత్రాల పోస్టర్లు శనివారం ఆవిష్కరించారు. డీసీపీ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App