ఆధునిక సాగు పద్దతులతో మంచి ఉత్పత్తి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ & సర్వీసెస్ ఆధ్వర్యంలో 4 వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, జనవరి -09 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆధునిక సాగు పద్దతులతో మంచి ఉత్పత్తి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ & సర్వీసెస్ ఆధ్వర్యంలో 4 డ్రోన్ వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడం ద్వారా రైతులకు మరింత లాభం లబ్ధి చేకూరుతుందని, వ్యవసాయ యాంత్రికరణలో భాగంగా నాట్లు వేయటం , పురుగుల మందు, గడ్డి మందు స్ప్రే చేయడం, ఎరువుల వినియోగం వంటి వాటికి డ్రోన్ సేవలను వినియోగించవచ్చని అన్నారు.
ఈ సేవలు అవసరమైన రైతులు బంధం పల్లి లోని విఘ్నేశ్వర డ్రోన్స్ సేల్స్ & సర్వీసెస్ ను సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆది రెడ్డి, విగ్నేశ్వర డ్రోన్ నిర్వాహకులు రమేష్ ,సంపత్, మహేందర్ ,అఖిల్, రాజు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App