తేదీ : 01/02/2025.
సుపరి పరిపాలన విధానం ప్రపంచానికి రోల్ మోడల్.
గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు పార్లమెంట్ అంగన్వాడి మరియు డ్వాక్రా సాధికారిక సంస్థ అధ్యక్షురాలు షేక్ . జానీ బేగం మాట్లాడుతూ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలో సుపరి పరిపాలన విధానం ప్రపంచానికే రోల్ మోడల్ గా మారుతుందని షేక్ .జాని బేగం అన్నారు. వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభించిన నేపథ్యంలో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది. గత ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తెచ్చామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నాయకులు చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోయారు అని అన్నారు.
ప్రజలు సమస్య ఉందని పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ లు తప్ప ప్రజలకు జరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి సమస్య కు పరిష్కారం అవుతుందని అనడం జరిగింది. దేశంలోనే తొలిసారిగా ఇలాంటి గవర్నెన్స్ తీసుకొచ్చిన ఏపీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ ఆలోచన విధానం ద్వారా ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు.
తొలి విడతలో దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్న, డొక్కా సీతమ్మ క్యాంటీన్, సీ.యం.ఆర్. ఎఫ్ , మున్సిపాల్ శాఖల్లో 161 సేవలు అందించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా వేదంగా పౌర సేవలు , పారదర్శకత , జవాబుదారీతనంలో భాగంగా వాట్స్అప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందన్నారు. 360 సేవలను అందుబాటులో ఉంచుతారన్నారు. ప్రజలు కు సర్టిఫికెట్స్ కావాలంటే కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు అని , ప్రతి సర్టిఫికెట్ పైన క్యూ ఆర్ కోడ్ ఉంటుందని ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదన్నారు. ప్రభుత్వ అందిస్తున్న ఈ సేవల్ని 95523 00009 వాట్సప్ నంబర్ ద్వారా ప్రజలు అన్నీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App