పేరు గొప్ప ఊరు దిబ్బ
పేరుకే పెద్ద ఆస్పత్రి, కనీసం పార్థివ వాహనం లేని దుస్థితిలో ఉంది గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి.
గోదావరిఖని తనేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ దృష్టి సారించింది ఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నూతన రెండు పార్థివ దేహాలను తరలించి వాహనాలను మంజూరు చేయించండి
గోదావరిఖని లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పేరుకే పెద్ద ఆస్పత్రి కనీసం పార్థివ వాహనాల కూడా లేకపోవడం విడ్డూరంగా ఉందని గత కొన్నేళ్లుగా వైద్యాధికారులు జిల్లా ముఖ్య అధికారులకు గత ప్రభుత్వాలకు విన్నవిస్తున్న పట్టించుకునే నాథులె లేరని డి హెచ్ పి ఎస్ నాయకులు మద్దెల దినేష్, ఏర్రల రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ రామగుండం, గోదావరిఖని అంటేనే పారిశ్రామిక ప్రాంతం ఎప్పుడు ఎక్కడ ఏమి జరగుతుందో తెలియని పరిస్థితి అని, అదే విధంగా ఈ ప్రాంతంలో సింగరేణి గనులు, భూగర్భ గనుల, వివిధ ఎన్టీపీసీ, అర్ఎఫ్సిఎల్ లాంటి పరిశ్రమలు, నగర పాలక సంస్థ, జాతీయ రహదారి, గోదావరి పరివాహక ప్రాంతం, ఇలా వీటిలో రోడ్డు ప్రమాదాలను, గని ప్రమాదాలు, మరియు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటు ప్రాణాలు వదులుతున్న వారు ఎందరో ఉన్నారని అవేదన వ్యక్తం చేశారు.
ఇలా మృతి చెందిన లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ప్రభుత్వ ఆస్పత్రి తీసుకవచ్చిననంతరం మృతి చెందుతున్నారాన్నారు.
మృతి చెందిన వారి మృత దేహాలను వారి స్వస్థలాలకు, వారిండ్లకు పంపించడానికి ఆర్థికంగా ఉచిత పార్థివ వాహనాలు లేక అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే పెద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతం అయిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉచిత 2 పార్థివ దేహాలను తరలించి వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలి రామగుండం ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ పాటు ఆరోగ్యశాఖ మంత్రి, & ముఖ్యమంత్రి ట్విట్టర్ X ద్వారా కోరామని మద్దెల దినేష్ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App