వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
సెయింట్ జూడ్స్ ప్రైమరీ పాఠశాలలో ఘనంగా నిర్వహణ
విద్యార్థుల ఆనందోత్సవ నృత్యాలు
అందరినీ అలరించిన క్రిస్మస్ తాత
కుల మతాలకతీతంగా సెమీ క్రిస్మస్
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి
వికారాబాద్ నియోజక వర్గ 6 త్రినేత్రం ప్రతినిధి డిసెంబర్ 23 : వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ కేంద్రంలోని సెయింట్ జూడ్స్ ప్రైమరీ పాఠశాలలో సోమవారం నాడు పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో వైభవంగా సెమీ క్రిస్మస్ వేడుకలను పండగల నిర్వహించారు. పాఠశాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో రంగు కాగితాల నక్షత్రాలతో అలంకరించి సెమీ క్రిస్మస్ వేడుకలను ఉపాధ్యాయుల విద్యార్థుల మధ్య సెమీ క్రిస్మస్ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాలలో జరిగిన వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీసస్ గురించి సందేశం ఇచ్చారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ఉపాధ్యాయులు ప్రదర్శించిన క్రీస్తు జనన నాటక కంఠస్థ వాక్యాలు అభినయ నృత్యాలు యోసేపు మేరీ మాత వేషధారణలు క్రీస్తు పశువుల పాక అందరిని విశేషంగా ఆకర్షించాయి.
పాఠశాలలో ఏర్పాటు చేసిన యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేరీ మాత పశువుల పాకలో బాలయేసుకు జన్మనివ్వడం దేవదూతలు గొర్రెల కాపర్ల ఆశీర్వాదాలు అందించడం వేగుచుక్క ప్రభు జన్మస్థానాన్ని తెలియజేపే సన్నివేశాలలో పాఠశాల ఉపాధ్యాయుల వేషధారణలతో అందరినీ అబ్బురపరిచారు. మేరీ మాత , యోసేపు, హేరోదు రాజు జ్ఞానులు, గొల్లల వేషధారణలతో అందరిని ఆకట్టుకున్నారు. క్రిస్మస్ తాత వేషధారణలో ఉపాధ్యాయులు విద్యార్థులు చాక్లెట్లు పంచారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి మాట్లాడుతూ ఏసుక్రీస్తు జన్మదిన క్రిస్మస్ ప్రపంచానికే పెద్ద పర్వదినం అని కరుణామయుని బోధనలను అందరికీ మార్గదర్శకమని ఆమె తెలిపారు. లోకాన్ని రక్షించడం కోసం పాపని విమోచించడం కోసం రిక్తునిగా జన్మించిన క్రీస్తు జననం యావత్ ప్రపంచానికి శుభదినం అన్నారు. ఈ శుభ దినాన్ని మా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కళ్లకు కట్టినట్లు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు అన్నారు.
బాల యేసుని వేడుకలలో భాగంగా విద్యార్థులు యేసు క్రీస్తును స్తుతిస్తూ పాడిన పాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయన్నారు. మనం తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించడానికి ఈ భూమి మీద అవతరించిన శక పురుషుడు ఏసుక్రీస్తు అన్నారు. అందుకే డిసెంబర్ 25న క్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకొని మనం క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నామన్నారు. క్రిస్మస్ పండుగ శాంతి సంతోషం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని సాటి మనిషి పై దయా కరుణ జాలి కలిగి ఉంటూ మన జీవనాన్ని కొనసాగించాలని ఆయన బోధించిన విషయాన్ని ప్రస్తావించారు. క్రీస్తు చూపెట్టిన మార్గంలో నడుస్తూ ఆదర్శంగా జీవించాలని ఆమె హితవు పలికారు. మనిషి మానవత్వంతో మసిలితే మహా పురుషుడిగా మారుతాడని ఏసుక్రీస్తు నిరూపించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి సాటివారిపై మానవత్వాన్ని ప్రదర్శించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App