![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-11.40.46.jpeg)
నగరి త్రినేత్రం న్యూస్ . నగరి పట్టణ పరిధిలో టీటీడీ అనుబంధంలో నున్న కరియమాణిక్య స్వామి ఆలయంలో మంగళవారం రధసప్తమి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం అభిషేకం, తోమాల సేవ నిర్వహించారు. తదుపరి శ్రీదేవి, భూదేవి సమేత కరియమాణిక్య స్వామి ఉత్సవమూర్తులకు వైభవంగా తిరుమంజనం సేవ నిర్వహించారు. సాయంత్రం కళ్యాణోత్సవ వేడుకలు నిర్వహించారు. అమ్మవారి అక్షింతలు, మంగళసూత్రాలను భక్తులు ఆశీర్వదించగా అర్చకుల వేదమంత్రోచ్చరణల మధ్య కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది.
టీటీడీ అధికారులు ఆచారం ప్రకారం స్వామివార్లకు పట్టుపీతాంబరాలు అందజేశారు. కళ్యాణోత్సవం సందర్భంగా అర్చకులు నిర్వహించిన ఆనంద నృత్యాలు, పూబంతుల ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున సతీసమేతంగా పూజల్లో పాల్గొన్నారు. పట్టు పీతాంబరాలు ధరించి ఉభయదారులు కరియమాణిక్యస్వామిని దర్శించుకున్నారు. ఉభయదారులకు ఆలయ అధికారులు అక్షింతలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్నమ్మ, ఏఈవో రవి, ఆలయ అధికారి వెంకటరమణ, గుణశేఖర్, వేదపండితులు రామ్‌ప్రసాద్, ధన్వంతరి, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Glorious Radhasaptami Kalyanotsavam](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-05-at-11.40.46-1024x1024.jpeg)