TRINETHRAM NEWS

సోమవారం వరకు టైం ఇవ్వండి!

Trinethram News : Hyderabad : పుష్ప హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆయన ఎవరికీ చెప్పకుండా .. ర్యాలీ చేసుకుంటూ ధియేటర్ కు రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది.మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన పోలీసులు .. దర్యాప్తులో ఇది పూర్తిగా అల్లు అర్జున్ తప్పిదం అని తేల్చడంతో అరెస్టు చేశారు.

అరెస్టు ముప్పును గమనించిన అల్లు అర్జున్ తనపై కేసును కొట్టి వేయాలని రెండు రోజుల కిందటే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంకా విచారణకు రాలేదు. తాను తొక్కిసలాట ఘటనకు కారణం కాదని ఆయన వాదించారు. అయితే పోలీసులు కోర్టులో ఏం చెబుతారన్నదానిపై వెయిట్ చేయకుండా హీరోను అరెస్టు చేశారు. సంధ్యా ధియేటర్ యాజమాన్యం కూడా అది ధియేటర్ ఓనర్లమే అయినాలీజుకు ఇచ్చామని.. ఏం జరిగినా బాధ్యత సినీ ప్రదర్శకులదేనని తేల్చారు.

వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి వాళ్లు వస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రూల్స్ ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డిని తీసుకుని ప్రీమియర్ కు వెళ్లిపోయారు. అంతే కాదు ధియేటర్ కు కిలోమీటర్ ముందు నుంచి ఓపెన్ టాప్ వాహనంలో చేతులు ఊపుతూ ర్యాలీ నిర్వహించారు. ధియేటర్ లోకి వెళ్లే సమయంలో అందరూ తోసుకెళ్లిపోయారు.

ఇప్పుడు అర్జున్ పోలీసులు విచారణ తర్వాత కోర్టులో హాజరు పరుస్తారు. కోర్టు ఆయనను రిమాండ్ తరలిస్తుందా.. వ్యక్తిగత పూచికత్తు కిందబెయిల్ ఇస్తుందా అన్నది కీలకంగా మారింది. రిమాండ్ కు తరలిస్తే పుష్పరాజ్ జైల్లో గడపాల్సిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App