తబితా ఆశ్రమంలో ఘనంగ సంక్రాంతి వేడుకలు.
ఆశ్రమ పిల్లలకు సంక్రాంతి పలహారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన మద్దెల దినేష్
సీనియర్ కళాకారుడు రేణికుంట్ల రాజమొగిలి సంక్రాంతి అవార్డుతో ఘనంగా సన్మానించిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం లోని తబితా ఆశ్రమం లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆశ్రమం లో ఉన్న పిల్లలకు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పండుగ పలహారాలు అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆశ్రమ పిల్లలకు సకినాలు, అరిసెలు, కారంపూస, చెక్కలు వివిధ రకాల స్వీట్స్ అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అనంతం గోదావరిఖని లో సీనియర్ కళాకారుడు 42 సంవత్సరాల నుండి పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నా రేణికుంట్ల రాజమొగిళి ఈ సంవత్సరం నుండి సంక్రాంతి అవార్డు ఒకరికి ఇవ్వాలని ఉద్దేశ్యంతో రాజమౌళి సంక్రాంతి అవార్డు ద్వారా వారికీ ఆశ్రమ పిల్లల మధ్య శాలువా కప్పి, మెమొంటో అందించి మొదటి సారి గా ఘనంగా సన్మానించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా
ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు రేణికుంట్ల నరేందర్, వై. లెనిన్, అన్వార్, ప్రసాద్, మరియు రాజా సులోచన తో పాటు ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్, విమల తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App