TRINETHRAM NEWS

Get ready for nationwide movements for the solution of workers’ problems

టి శ్రీనివాస్(ఐ ఎఫ్ టి యు) జాతీయ ప్రధాన కార్యదర్శి.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఆదిత్య హోటల్ బ్యాంక్ హాల్ లో రెండు ఐ ఎఫ్ టి యు ల ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు నిర్వహించడం జరిగింది.

ఈ ప్రాంతీయ సదస్సులో టి. శ్రీనివాస్ ( ఐ ఎఫ్ టీ యు) జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎం. శ్రీనివాస్ (ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఐ. కృష్ణ ( ఐ ఎఫ్ సి యు )రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత సాక్ష్య ఆది నియమం మరింత కఠినంగాను ప్రమాదకరంగాను ఉన్నాయన్నారు. ఈ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన మరుక్షణమే 650 జిల్లాల్లో 16 వేల పోలీస్ స్టేషన్లో పరిధిలో హడావుడిగా అమలు చేస్తున్నారన్నారు. ఈ చట్టంలో మరో 20 కొత్త నేరాలను చేర్చారని మొత్తం మీద 33 కొత్త శిక్షలు 83 కొత్త రకాల జరిమాణాలు విధించే అవకాశం కల్పించాయన్నారు
ఈ చట్టాల రూల్స్ కష్టడికి లాకప్ నియమాలను అధిగమిస్తే ఏ పౌరుడైన ఏ క్షణంలోనైనా కస్టడీలోకి తీసుకోవచ్చని ఈ చట్టాల వల్ల పోలీసులకు విస్తృత అధికారాలు లభించాయని
ఈ చట్టాలు టెర్రరిజానికి వచ్చిన కొత్త నిర్వచనం ప్రకారం ప్రజలను ఎవరినైనా జైలుకు పంపే ప్రమాదం ఉందని రాజ్యాంగబడ్డంగా నిరాహార దీక్షలు ధర్నాలు సమ్మెలు చేసే వారిని అరెస్టులు చేసి జైలుకు పంపే అధికారం పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చారన్నారు. అదేవిధంగా కేంద్రం బిజెపి పాలకులు స్వదేశీ విదేశీ బడా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలకు అనుగుణంగా దేశ కార్మిక వర్గం యొక్క ఆర్థిక ఉపాధి ఉద్యోగ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వారి మౌలిక హక్కులను రద్దు చేసే విధంగా నాలుగు లేబరు కోడ్లను రూపొందించి అమల్లోకి తెచ్చాయన్నారు. ఈ లేబర్ కోడ్స్ వల్ల దేశ కార్మిక వర్గాన్ని పెట్టి చాకిరి చేసే విధంగా మరింత బానిసత్వంలోకి మధ్యయుగాల పరిస్థితుల్లోకి నెట్టే విధంగా ఉన్నాయన్నారు ఈ లేబర్ కోడ్స్ వలన కార్మికుల కనీస వేతనాలు ఉపాధి ఉద్యోగ భద్రత వారికి చట్టబద్ధంగా లభించే సామాజిక భద్రత ప్రయోజనాలు ప్రశ్నార్థకంగా మారాయి అన్నారు ప్రస్తుతం దేశంలో కార్మిక వర్గం 75% మంది కార్మికులు 71.2% ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారన్నారు వీరికి కనీస వేతనం వర్తించదు అందువలన దేశ ప్రజల కార్మికుల ప్రాథమిక హక్కులను అత్యంత ప్రమాదకరమైన నూతన నేర చట్టాలను నాలుగు లేబరు కోడ్స్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు
ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులను పూజిస్తూ కాంట్రాక్టర్స్ కార్మికులను నియమిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సంస్థలు వివిధ విభాగాలు పనిచేస్తున్న 3 లక్షల మంది ఈ కార్మికులకు కనీస వేతనము సమాన పనికి సమాన వేతనము ఇతర చట్టబద్ధ హక్కులు లభించని పరిస్థితి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వివిధ విభాగాలు పనిచేస్తున్న స్కీం వర్కర్లు కార్మికులుగా ఉద్యోగులుగా గుర్తింపు లేదన్నారు కనీస వేతనాలు సామాజిక భద్రత సౌకర్యాలు లేవన్నారు మన రాష్ట్రంలో 73 షెడ్యూల్ రంగాల్లో పనిచేస్తున్న ఒక కోటి 20 లక్షల మందికి గత దశాబ్ద కాలంగా కనీస వేతనాలు జీవోలు విడుదల కాలేదన్నారు. మోటార్, హమాలి, తదితర రంగాల కార్మికులకు సంక్షేమ బోర్డులు లేవు ఈ విధంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.

ఈ సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం పోరాటాలను తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు

ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో కి రాగానే కార్మిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కార్పొరేట్ సంస్థలు అనుకూలంగా చట్టాలను సవరణ చేస్తూ కార్మికులను బానిసలుగా తయారు చేసే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయన్నారు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ అవుట్సోర్సింగ్ కారం కులం తీసుకువచ్చి కనీస వేతనాలు లేకుండా కాయ కష్టం చేసే కార్మికులకు ఒక పద్ధతి ప్రకారం గా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు అతి తక్కువ వేతనాలతో ని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అన్ని రంగాల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. కనుక భారత కార్మిక సంఘాల సమైక్య ఐ ఎఫ్ టి యు ఉభయ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చాయని ఈ పిలుపులో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం బాధ్యత కార్మిక వర్గంపై ఉందని వారు పిలుపునిచ్చారు.

ఈ ప్రాంతీయ సదస్సు కు 2.ఐ ఎఫ్ టీ యు ల జిల్లా అధ్యక్షులు ఈ నరేష్,ఈ రాజేందర్ లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా వక్తలు గా 2.ఐ ఎఫ్ టీ యు ల రాష్ట్ర నాయకులు ఏ వెంకన్న, ఎం డి చాంద్ పాషా, బి అశోక్, డి. బ్రహ్మానందం టీ శ్రీనివాస్, చిలుక శంకర్,ఈ రామకృష్ణ, జీ మల్లేశం, ఎం దుర్గయ్య, బిచ్చయ్య, ప్రసాద్,బుచ్చమ్మ, యాదగిరి, సురేందర్ లతో పాటు 200 వందల మంది అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Get ready for nationwide movements for the solution of workers' problems