TRINETHRAM NEWS

పీవీటీజీ గ్రామాలకు ఇల్లులు ఇచ్చి, రోడ్డు, త్రాగునీరు మరిచారు, ఆదివాసి గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెల చిన్నబాబు.

అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్. డిసెంబర్.11 :

అరకు వేలి మండలం బస్కి పంచాయతీ బిజగూడ, కొంత్రాయి గుడా కంజారా తోట గ్రామాల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్న గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు గెమ్మెల చిన్న బాబు.
గిరిజన సంఘం మండల అధ్యక్షులు చిన్న బాబు మాట్లాడుతూ ప్రభుత్వం పీఎం జన్మన్ పథకంలో పీవీటీజీ కుటుంబాలకు ఇల్లులు మంజూరు చేసింది కాని ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి రోడ్డు మంజూరు చేయలేదు కొంత్రాయి గుడా బిజ గుడా గ్రామాల్లో రోడ్డు మార్గం లేకపోవడంతొ ఉన్న మట్టి రోడ్డు పూర్తి గుంతలు ఏర్పడి మరమత్తులకు గురవడం వలన గ్రామాల్లో ఇల్లులు మంజూరైనా లబ్ధిదారులు ప్రభుత్వం 2.39లక్షలతో ఏవిదంగా ఇళ్లు నిర్మాణం చేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పీవీటీజీ కుటుంబాలకు ఇల్లు నిర్మాణానికి 5లక్షలకు పెంచాలి. పీవీటీజీ గ్రామాలకు పీఎం జన్మన్ పథకం ద్వారా 11 రకాల అభివృద్ధి పనులు చేస్తున్నాము అని గొప్పలు చెపుతున్న ప్రభుత్వం కొంత్రాయి గుడా బిజగుడా గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు లేవు ఈ గ్రామాల ప్రజాలు ఏ విదంగా ఇల్లు నిర్మాణం చేసుకొంటారు అలాగే ఈ గ్రామాల్లో త్రాగునీరు సదుపాయాలు లేవు ఉన్న కుళాయి ట్యాంక్ పూర్తిగ మరమత్తులకు గురైంది. అని తెలిపారు, అలాగే ప్రభుత్వం పీవీటీజీ గ్రామాలకు ఏదో చేస్తున్నట్టు గొప్పలు చెప్పడం కాదు పీఎం జన్మన్ పథకం ద్వారా పీవీ టీజీ గ్రామాలకు రోడ్డు, డ్రైనేజీ, సీసీ రోడ్డు, త్రాగునీరు, సదుపాయాలు కల్పించాలి లేకపోతే ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పీవీ టీజీ కుటుంబాలను చైతన్య పరిచి ఆందోళన చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలోగ్రామస్తులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App