Gandhi had the same idea
Trinethram News : Telangana : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత సంగతి విషయంలో హైకోర్టు ఆదేశాలు ఉండగా.. స్పీకర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అవుతోంది .
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యేను పీఏసీ చైర్మన్ గా నియమించడం సరికొత్త చర్చకు దారితీయగా.. తాజాగా అరికపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాను ప్రతిపక్షంలో ఉన్నందుకే పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని , అసలు తాను కాంగ్రెస్ లోనే చేరలేదని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్నారు.
అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తానన్నారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని చెబుతూనే.. బీఆర్ఎస్ పై అరికపూడి గాంధీ విమర్శలు గుప్పించారు.
హరీష్ రావుకు పీఏసీ చైర్మన్ పదవి ఇస్తేనే ప్రతిపక్షంగా భావిస్తారా? వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోరా..? అంటూ ప్రశ్నించారు.
అరికపూడి గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
తాను ప్రతిపక్షంలో ఉన్నాననే గాంధీ వాఖ్యల వెనక వ్యూహం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపుల విషయంలో హైకోర్టు ఆదేశాలతో అనర్హత వేటు ఎదుర్కొనే అవకాశం ఉందన్న సూచనలతోనే అరికపూడి గాంధీ తెలివిగా ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారని, పైగా స్పీకర్ కార్యాలయం కూడా అరికపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టడం వెనక ఇదే వ్యూహం ఉందని అంటున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App