TRINETHRAM NEWS

భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.

మనుషులు చేసినట్టే చనిపోయిన పిల్ల ఏనుగుల మృతదేహాలకు పద్ధతి ప్రకారం ఏనుగులు అంత్యక్రియలను నిర్వహిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ మేరకు 2022, 2023లో బెంగాల్‌లో ఉండే 15 నుంచి 20 ఏనుగులకు సంబంధించి ఐదు కేసులను విశ్లేషించినట్టు అధ్యయనంలో భాగమైన ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కశ్వాణ్‌, ఆకాశ్‌దీప్‌ రాయ్‌ పేర్కొన్నారు.

ఈ వివరాలు ‘థ్రెటెన్డ్‌ టాక్సా’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి…