
యువతకి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించిన గాదె సుధాకర్
ఆకెనపల్లి గ్రామం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : ఆకెనపల్లి గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది యువకులకు వాలీబాల్ ఆడటం కోసం T- షర్ట్ లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని గాదె సుధాకర్ పేర్కొన్నారు అంతర్గాం మండలం లోని ఆకెనపల్లి గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ సందర్భంగా యువత ను ప్రోత్సహించడానికి , యువకులు చెడు మార్గంలో ప్రయాణించకుండా ఆటల వైపు యువకులు వెళ్లే విధంగా , ఆటల వలన యువకులకు వచ్చే గుర్తింపును వివరిస్తూ, ఆటల వలన యువత దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు అని యువత ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఆటలు చాలా ఉపయోగకరమైనవి అంతేకాకుండా యువకులు మంచి ఆటలు ఆడటం వలన యువత దృఢంగా ఉంటారని గాదె సుధాకర్ తెలిపారు
భవిష్యత్తులో మీకు ఇంకా ఎలాంటి అవసరం ఉన్న నన్ను కలువండి , మన ఆకెనపల్లి గ్రామ అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పని చేద్దాం అని యువకులకు అండగా నేను ఉంటా అని భరోసా ఇచ్చిన గాదె సుధాకర్
ఈ సందర్భంగా ఆకెనపల్లి గ్రామ యువకులు గాదె సుధాకర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అడ్లూరి బాణయ్య,టీ షార్ట్స్ స్పాన్సర్ గాదె సుధాకర్, మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీను, ఆర్గనైజర్ సామల కుమార్,ఆగ్గి భుమేష్, సామల హరీష్,అడ్లూరి కర్ణాకర్,మాజీ సర్పంచ్ ముక్కెర శ్రీను, మర్రి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
