TRINETHRAM NEWS

నేటి నుండి అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం తో పాటు కందిపప్పు, పంచదార, జొన్నలు సరఫరా

రాష్ట్రంలోని రేషన్ కార్డ్ దారులందరికీ నవంబరు నుంచి ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని MLS పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా చర్యలు తీసుకున్న పౌరసరఫరాలశాఖ….

నవంబరు1 నుంచి రేషన్ కార్డు దారులందరికీ రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ…..

కిలో కందిపప్పు రూ.67కు, అరకిలో పంచదార రూ.17కు అందించేందుకు చర్యలు తీసుకున్న పౌరసరఫరాలశాఖ అధికారులు..

కానీ గిద్దలూరులో ఆలెక్కే వెరబ్బా..!

గిద్దలూరు రేషన్ దుకాణాల్లో మాత్రం ఒక బియ్యం , చక్కెర తప్ప మిగిలిన పదార్థాలు వాట్సప్ లో చూసుకోవటం తప్ప తమకు చేరటం లేదని లబ్ధిదారుల ఆరోపణ.

బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న నిర్వాహకులపై అధికారుల చర్యలు శూన్యం అంటూ విమర్శల వెల్లువ.

సంబంధిత శాఖాధికారులు ఇకనైనా స్పందించేనా…?

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App