Trinethram News : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి వికలాంగులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు త్వరితగతిన అమలు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడి
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు మంగళవారం హైదరాబాదులోని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు కేటాయించిన సీట్లో కూడా మహిళలు కూర్చుంటూ తమ సీటు తమకు ఇవ్వమని అడిగిన వికలాంగులతో ఘర్షణకు దిగుతున్నారని వెంటనే ఈ విషయంపై మంత్రిగా మీరు దృష్టి సారించి వికలాంగులకు ప్రస్తుతం ఉన్న సీటుతోపాటు అదనంగా మరో రెండు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో కూర్చొని ఆధిపత్యం చెలాయిస్తున్న సకలాంగులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లతో పాటు అభయ హస్తం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేర్చాలని ముఖ్యంగా ఆరు గ్యారెంటీలకంటే అట్టడుగున ఉన్న వికలాంగుల సామాజిక వర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయినా 6000 పెన్షన్ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలు లాంటి అంశాలను త్వరితగతిన అమలు చేయాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసేంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలిపారు
ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని
Related Posts
రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ సమావేశం
TRINETHRAM NEWS రామగుండం ఎమ్మార్పీఎస్. ఎంఎస్ పి కార్పొరేషన్ సమావేశం మాలల ఒత్తిడితోనే ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 29వ తేదీనాడు రామగుండం ఎమ్మార్పీఎస్. ఎం ఎస్ పి మున్సిపల్ నూతన కమిటీ నియామకం…
పొలం బాటలో విద్యుత్ అధికారులు
TRINETHRAM NEWS పొలం బాటలో విద్యుత్ అధికారులు రచ్చపల్లి గ్రామం ,ధర్మారం మండలం లో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సూపరింటెండింగ్ ఇంజనీర్ కంకటి మాధవరావు వినియోగదారులతో మాట్లాడుతూ గ్రామం లో…