TRINETHRAM NEWS

ఉచిత కంటి వైద్య శిబిరం
తేదీ : 10/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చను బండ గ్రామం సచివాలయం లో జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మో రంపూడి శ్రీనివాసరావు సారథ్యంలో భగవన్ శ్రీ సత్య సాయి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు సమస్య వస్తే నాకు తెలిసిన వెంటనే సమస్యకు పరిష్కారం చేసే దిశగా నేనెప్పుడూ ముందుంటానని అన్నారు.
సచివాలయంలో రిబ్బన్ కట్ చేసి కంటికి సంబంధించిన వారికి కంటి పరీక్షలు , బిపి షుగర్, వాటిని చూడడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వి. జ్యోతి, శ్రీ సత్యసాయి భగవాన్ ట్రస్ట్ వారు కె. వి. సత్యనారాయణ, వి. ప్రవీణ్, జి. చలపతిరావు, కె. చక్రధర్ రావు, జె. జగ్గారెడ్డి, ఎ. లక్ష్మి, శాంతి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free Eye Camp