Free cremation should be performed at the Hindu graveyard near Godavari in Godavarikhani.
స్వచ్ఛంద సంస్థల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్మశానం సందర్శించి నిరసన తెలిపారు.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరి నది తీరాన హిందూ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలంటే భారీ ఖర్చుతో కుడుకుందని నిరుపేద, పేద, మధ్యతరగతి వారెవరైనా మృతి చెందితే అంత్యక్రియలు వారి బంధువులు నిర్వహించాలంటే నేడు వ్యాపారంలా మారిపోయిందని రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక నిర్వాహకులు పేర్కొన్నారు.
ఆదివారం రోజున స్వచ్ఛంద సంస్థ ఐక్య వేదిక నిర్వాహకులు స్మశానాన్ని సందర్శించి వివిధ సౌకర్యలు కార్పొరేషన్ మరియు సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. అనంతరం మద్దెల దినేష్, 32వ డివిజన్ కార్పొరేటర్ ఐత శివ, ప్రధాన కార్యదర్శి పల్లర్ల రమేష్, ఉపాధ్యక్షురాలు గొలివాడ చంద్రకళ మాట్లాడుతూ
గోదావరిఖని హిందూ స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువైనాయని, దురదృష్టం కొద్దీ ఎవరైనా మృతి చెందితే బంధువులు అంతక్రియలు నిర్వహించాలంటే 15000 నుంచి 40 వేల రూపాయలు వరకు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రామగుండం నగరపాలక సంస్థ దాదాపు 2020 సంవత్సరం నుండి 2024 ఏప్రిల్ వరకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించారని నగరపాలక సంస్థలో ప్రజా ప్రతినిధులకు అనుకూలంగా ఉండే వారికి కాంట్రాక్టులు ఇచ్చి విచ్చలవిడిగా బిల్లులు తీసుకొని ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయనే సాకు తో, మరియు వాటిలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కావున రామగుండం నగరపాలక సంస్థ ఉచిత అంతక్రియలను నిలిపివేయడం దురదృష్టకరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు రామగుండం నగర పాలక సంస్థ ఉచిత దహన సంస్కారాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నాదా లేదా? అని ప్రశ్నించారు, వారి పై నగర పాలక సంస్థ స్మశానం నిర్వహణ పరంగా అభివృద్ది చేసి సింగరేణికి నిర్వహణ బాధ్యతలు ఇవ్వాలని అన్నారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఎవరైనా మృతి చెంది, హిందూ స్మశాన వాటికకు తీసుకోవస్తే వారి వారి సంప్రదాయాల ప్రకారం కట్టెల కోసం అని లేదా బొంద త్రవ్వడం కోసం అని, డప్పులు అని ప్రైవేటు వ్యక్తులు విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటున్నారని, దాంతో పేద మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
స్మశానంలో పూర్తిగా సౌకర్యాలు కరువై, రాత్రి దహన సంస్కారాలు నిర్వహిస్తే కనీసం లైట్లు కూడా వెలగని పరిస్థితి దాపురించందని, రోడ్లు మొత్తం చెడిపోయినాయని చివరికి కాంపౌండ్ వాల్ కూడా లేదని అవేదన వ్యక్తం చేశారు. ఇక స్మశానం లోపల కనీసం గ్రీనరీ లేదని, చెత్తాచెదారంతో నిండిపోయిందని స్మశానాన్ని కాపాడే వారే లేరని, స్మశానం అడవిని తలపించే విధంగా ఉందన్నారు.
అదేవిధంగా విద్యుత్ దహన సంస్కారాల యంత్రం దాదాపు 30లక్షల రూపాయల నిధులతో వేచ్చిస్తే రోజురోజుకు ఆది తుప్పు పట్టి శిథిలావస్థకు చేరుతుందని దానిని పట్టించుకున్న నాధుడే లేడన్నారు. దానికోసం 60 లక్షల రూపాయల నిధులతో షెడ్డు నిర్మాణం చేసిన ఉపయోగం లేదన్నారు.
కనీసం త్రాగడానికి మంచి నీరు కూడా లేదని, స్మశానం ఆవరణలో సింగరేణి యాజమాన్యం ద్వారా
ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు.
అదే విధంగా గంగానగర్ పెట్రోల్ బంక్ నుండి స్మశానం వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, నూతన రోడ్డు వేయాలని, అదే విధంగా స్మశానంలో లోపల సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు.
కావున ప్రజల బాధలను అర్థం చేసుకొని సింగరేణి యాజమాన్యం స్పందించి ఉచిత దహన సంస్కారాలు అమలు పరచాలని స్మశానంలో కనీస సౌకర్యాలు అమలు చేయాలని స్థానిక రామగుండం శాసన సభ్యులు మక్కాన్ సింగ్, నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీకాంత్ సింగరేణి సి&ఏండి బలరాం అర్జీ వన్ జి ఏం చింతల శ్రీనివాస్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక సభ్యులు జక్కని శ్రీలత, కొమ్మ చందు యాదవ్, సుద్దాల అనురాజ్, రినికుంట్ల నరేంద్ర , నజీమ, శ్రీలత, నస్రీన్, కంది సుజాత మందల రమాదేవి, గాదం సరిత, బిల్లా శ్రీదేవి, బోగే లత పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App