Four years ago, Sumedha fell into Nala while riding a bicycle in the rain
నాలుగేళ్ల క్రితం వర్షంలో సైకిల్ తొక్కుతూ నాలాలో పడిపోయిన సుమేధ
ఇలాంటి ఘటన పుణవృతం కాకుండా నాలా పూడికతీత మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చర్యలు
త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లో
గత నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు సైకిల్ తొక్కుతూ వచ్చిన చిన్నారి సుమేధ నాలాలో పడిపోయి బండ చెరువులో శవమై తేలింది, అప్పుడు కొంతమంది అధికారులు నామమాత్రపు చర్యలతోనే సరిపెట్టారు, మళ్ళీ వర్షాకాలంలో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకూడదని, సుమేద ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులతో కలిసి దీనదయాల్ నగర్లో పర్యటించి, నాలా పూడిక అట్టడుగు నుండి తీస్తేనే వరదనీటి ప్రవాహం కాలనీలోకి చేరకుండా ఉంటుందని, అట్టడుగు నుండి పూడిక తీసి నాలాలో నుండి చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు, జరుగుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే స్వయంగా తనే లోతైన నాలలోకి దిగి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నాలా పూడిక తీయకుండా ఉండడంతో చెత్త పేరుకుపోయి వరద నీరు రోడ్ల పైకి రావడంతో సుమేథ ఉదంతం జరిగిందని, ఇక పై అలాంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App