TRINETHRAM NEWS

జగదాంబ అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జగదాంబ అమ్మవారి ఆలయం 19వ వార్షికోత్సవం పూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో వెంకటాపూర్ తండాలో నిర్మించబడిన జగదాంబ అమ్మవారి ఆలయం లో 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడు రోజులుగా పూర్ణాహుతి, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

ఇందులో భాగంగా డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్ , కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి తో కలిసి వికారాబాద్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ నాయక్ ని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మాలే గాయత్రి లక్ష్మణ్, దేవి రెడ్యానాయక్, నాయకులు మాలే లక్ష్మణ్, దీపు, సర్పరాజ్, రెడ్యానాయక్, సందీప్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagadamba