TRINETHRAM NEWS

ఆంధ్ర కి జగన్ ఏ ఎందుకు కావాలి, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం,
రంగంపేట: త్రినేత్రం న్యూస్

అనపర్తి నియోజకవర్గంలో “ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలి” అనే కార్యక్రమం రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో సర్పంచ్ చింతపల్లి సత్యనారాయణ, అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

ఈ కార్యక్రమంలో ముందుగా అధికారులు సంబంధిత గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను డిస్ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు.

అనంతరం గత నాలుగేళ్లుగా మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి, చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ మెంబర్ లంక చంద్రన్న , మండల కన్వీనర్ నల్లా శ్రీను, ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావు , వైస్ ఎంపీపీ రాయుడు రాంబాబు, పార్టీ కన్వీనర్ బత్తిన రాముడు , అనపర్తి మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సెక్రటరీ కొల్లాటి ఇశ్రాయేలు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రవి , వైఎస్ఆర్సిపి సచివాలయ కన్వీనర్లు మరియు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App