TRINETHRAM NEWS

ముద్రగడ నివాసం లో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్

ముద్రగడ ఇంటిపై దాడి ని తీవ్రంగా ఖండిస్తున్నాం

పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దారుణం

చంద్రబాబు మైకం నుండి పవన్ కళ్యాణ్ బయటకు రావాలి

Trinethram News : కిర్లంపూడి : ముద్రగడ ఇంటిపై దాడి జరిగినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని తక్షణమే డిజిపి స్పందించి ఈ ఘటన లో పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు.

పవన్ కళ్యాణ్ ఎంపీడీవో మీద దాడి జరిగితే తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్ ఒక క్యాబినెట్ హోదా, ఎంపీ హోదా, సమాజంలో రాజకీయాలకు నీతి నిజాయితీకి నేటికీ నిలువెత్తు నిదర్శనంగా ఉన్న వ్యక్తి ముద్రగడపై దాడి జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ నోరు మెదపకుండా మౌనం వహించడం మంచిది కాదని తక్షణమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలన్నారు.

రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని అధికారం ఉన్నంత మాత్రాన కూటమి నేతలు ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం పై మండిపడ్డారు.

ముద్రగడ లాంటి వ్యక్తికే రక్షణ లేకుండా పోయిందని పోలీసులు కూడా ముద్రగడకు రక్షణ కల్పించవలసినప్పటికీ కనీసం ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా ముద్రగడ పై దాడి జరిగినప్పటికీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి సరికాదని తక్షణమే ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసి దీని వెనక ఉన్న వారిని తక్షణమే అరెస్టు చేయాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజ్,ఎంపీపీ మార్గాని గంగాధర్,జడ్పీటీసీ బోనం సాయిబాబా, కర్రి నాగిరెడ్డి, మట్టా బాబ్జీ, పెదపూడి బాపిరాజు, మట్టా మురళి,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chirla Jaggireddy