TRINETHRAM NEWS

నెల్లూరులో మాజీ మంత్రులు కాకాణి… మీడియా సమావేశం..

Trinethram News : Nellore : మాజీ మంత్రి కాకాణి కామెంట్స్….

నెల్లూరు డిప్యూటీ మేయర్… బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టిడిపి తరఫున అభ్యర్థులను పెట్టుకుని గెలిపించుకున్నామని చెప్పే. సత్తా కూడా ఆ పార్టీ నేతలకు లేదు

టిడిపి తరఫున బీఫామ్ కూడా ఇవ్వలేదు .. వైసిపి విధానాలు నచ్చకపోవడం వల్ల టిడిపికి మద్దతు ఇచ్చామని కొందరు కార్పొరేటర్లు చెబుతున్నారు .. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి టిడిపి తరఫున పోటీ చేసి గెలవాలి

మునిసిపల్ శాఖ మంత్రిగా ఉంటూ మంత్రి నారాయణ .. అడ్డమైన వ్యవహారాలకు తెర తీశారు .. నగరపాలక సంస్థ కార్యాలయానికి కూడా మంత్రి రాలేదు .. టిడిపి తరపున బీ..ఫామ్ ఇవ్వలేదని ఎన్నికల అధికారి చెప్పలేకపోయారు

టిడిపి తరఫున అభ్యర్థులను గెలిపించుకున్నామని ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నాను .. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాత్రం చంద్రబాబు.. లోకేష్ .. పవన్ లకు కానుకగా ఇచ్చామని చెబుతున్నారు

విప్ గురించి టిడిపి నేతలకు తెలియదు .. మూడింట రెండువంతులు ఫిరాయిస్తే .. చట్టం వర్తించదని టిడిపి నేతలు చెబుతున్నారు

కానీ ఈ చట్టానికి మూడో క్లాజులో చేసిన సవరణను టిడిపి నేతలు మరిచిపోతున్నారు. పార్టీ ఫిరాయింపులపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం

అధికారులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former ministers Kakani