ఈడి విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్!
Trinethram News : హైదరాబాద్: జనవరి 16
ఫార్ములా ఈ-కార్ రేసులో గురువారం ఈడీ విచార ణకు హాజరుకానున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్, బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు జరిగాయనే కోణంలో ఈడి దర్యాప్తు జరుగుతుంది,
ఈరోజు ఉదయం 10:30 ఈడీ ఆఫీస్ కు బయలు దేరారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తన గండిపేట ఫాంహౌస్ నుంచి ఈడీ ఆఫీస్ కు కేటీఆర్ బయలుదేరి వెళ్లారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ను విచారించ న్నారు ఈడీ అధికారులు.
ఇలాంటి నేపథ్యంలో…ఈడీ కార్యాలయం వద్ద పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పా టు చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడి అధికారులు విచారణ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గత నాలుగు రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు కూడా విచారించిన సంగతి తెలిసిందే. ఆరోజు కూడా… ఏడు గంటల పాటు కేటీఆర్ ను విచారించారు. ఆ తర్వాత మళ్లీ విచారణకు పిలుస్తామని కేటీఆర్ కు చెప్పడం జరిగింది.
ఇక ఇవాళ ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఈడి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈ కేసులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరిగ లేదని పదేపదే కేటీఆర్ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App