TRINETHRAM NEWS

తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పాయింట్స్….

Trinethram News : మూసీ బాధితులకు పునరావాసం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్ ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గు చేటు. భూసేకరణ చట్టం 2013 ను అమలు చేస్తున్నామని పచ్చి అబద్దం చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచిపెడుతున్నది.
పార్లమెంట్ లో మా ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో రాష్ట్ర కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడింది.
కేంద్రానికి చెబుతున్నది ఒకటి, ఇక్కడ అమలు చేస్తున్నది మరొకటి భూసేకరణ చట్టం 2013 కంటే మెరుగైన చట్టాన్ని కేసీఆర్ గారు రూపొంది అమలు చేసారు.
ఆయన కూడా ఒక నిర్వాసిత కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి నిర్వాసితుల గురించి ఆలోచన చేసారు.
నిర్వాసితులకు 121 గజాల స్థలంలో ఐఏవై ఇళ్లు కట్టించాలని 2013 చట్టం చెబితే, కేసీఆర్ గారు 250 గజాల స్థలం, డబుల్ బెడ్ రూం ఇల్లు గా మార్చారు.
ఐఏవై ఇళ్లు అంటే ఆరోజు లక్షా 20వేల మాత్రమే మన డబుల్ బెడ్ రూం ఇల్లు అంటే 5,6 లక్షలు.
వేజ్ లాస్ కూడా పెంచడం జరిగింది.
కానీ ఇప్పుడు మూసి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App