Former hospital principal arrested in junior doctor rape case
Trinethram News దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతా ఆర్ జికర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసు విషయంలో సిబిఐ స్పీడ్ ను పెంచింది. తాజాగా ఆర్ జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేసింది. మరో పోలీసు అధికారిని కూడా అరెస్టు చేసింది.
మెడికల్ కాలేజీలో అవకతవకలకు పాల్పడిన కేసులో ఇప్పటికే సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యురాలి అత్యాచారం కేసులో సందీప్ అరెస్ట్ అయ్యారు. సందీప్ ఘోష్ ను శనివారం అర్థ రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిన డాక్టర్లు సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఓ జూనియర్ డాక్టర్ మాట్లాడుతూ.. సాక్ష్యాలను తారుమారు చేయడం వల్ల కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీసు అధికారి అభిజిత్ మోండల్ ను అరెస్టు చేయాలని మేము మొదట్నుంచీ డిమాండ్ చేస్తున్నాము.
ఈ అరెస్టు సంతోషం కలిగిస్తుందని తెలిపారు. సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇంచార్జీ అభిజిత్ మండల్ ను సిబిఐ అరెస్టు చేయడంపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుకాంత మజుందార్ కూడా స్పందించారు.
ఈ రోజు చేసిన అరెస్టులు చాలా ముఖ్యమైనవని..తాలా పోలీస్ స్టేషన్ ఇంచార్జీ అరెస్టు అత్యాచారం కేసులో అవకతవకలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్టు అయ్యారు. వాళ్లను అరెస్టు చేయాలని బెంగాల్ ప్రజలు మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నారు.
ఒక చిన్న స్టేషన్ ఇంచార్జీ ఇలాంటి నిర్ణయం తీసుకోగలడా? అని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు సీఎంను ఆ పదవి నుంచి తొలగిస్తారా? అంటు సుకాంత ముజుందార్ ప్రశ్నించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App