Former Collector Muzamil thanked the Tabitha Ashram children and bade farewell
తబితా చిన్నారులకు విందు మరియు పిల్లల చిత్రాన్ని చూపించడం జరిగింది.
మాజి కలెక్టర్ ముజామిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి వీడ్కోలు పలికిన తబితా ఆశ్రమ చిన్నారులు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అధికారం, పదవులు, వివిధ రకాల హోదాలు, డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి. కానీ, సహాయం చేసే గుణం మాత్రం చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. అలాంటి వాళ్లలో పెద్దపల్లి జిల్లా లో కలెక్టర్‌గా చేసిన ముజామిల్ ఖాన్ ముందు వరుసలో ఉంటారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా చేసినన్ని రోజులు నిత్యం ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నిరంతం బిజీగా ఉంటు ప్రజలకు పనిచేసరని అలాంటి జిల్లా కలెక్టర్ బదిలి అయి వెళ్తున్న సందర్భంగా చాలా మంది కొంత ఆందోళన చెందారు.
తాను ప్రజలకే కాదు, అనాధ పిల్లలకు ఎంతో సహయం చేయడంలో ముజామిల్ ఖాన్ ఎప్పుడూ ముందే ఉంటాడు.
తను బదిలి అయిన సందర్భంగా తనకు నచ్చిన, ఇష్టమైన పిల్లలు తబితా ఆశ్రమ పిల్లలను ఎంతో ప్రేమించేవారు, తను ఖమ్మం కలెక్టర్ గా బదిలి అయిన సందర్బంగా పిల్లలకు గోదావరిఖనిలో ఒక సినిమా థియేటర్లో పిల్లలందరినీ తీసుకెళ్లి మనమే అనే పిల్లల చిత్రాన్ని చూపించి అనంతరం ఒక ప్రైవేట్ ఫ్యామిలీ రెస్టారెంట్ తీసుకెళ్లి పిల్లలందరికీ బోజనాలు ఏర్పాటు చేయించడం వల్ల పిల్లలు కలెక్టర్ ముజమిల్ ఖాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అన్నారు. కన్నవారే కాదని వెళ్లడంతో అనాధలైన పిల్లలని మీరంతా నా పిల్లలు అని తబితా ఆశ్రమ చిన్నారాలంత నా కుటుంబం అని సమయం దొరికినప్పుడల్లా ఆశ్రమానికి విచ్చేసి వారికి అండగా ఉంటున్న గొప్ప మనసున్న మహారాజ్ మన కలెక్టర్ ముజామిల్ ఖాన్ గారని పిల్లలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెజిస్ట్రేట్ హోదాలో ఉన్న సామాన్య వ్యక్తిలనే ఉంటూ పిల్లల బాగోగులన్నీ చూసుకుంటు ఆశ్రమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలని ప్రోత్సహిస్తున్న కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆశ్రమ చిన్నారులు.
ఎంతో పెద్ద హోదాలో ఉండి నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ తబితా ఆశ్రమ పిల్లలకు దేవుడయ్యాడు. దేవుడు ఎక్కడో ఉండడు. ఎదుటి వారి నుంచి కష్టం అనే మాట నోటి నుంచి వినిపించినప్పుడు చేరదీసి, ఆదుకున్నవాడే దేవుడని
ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ విమల గార్లు తెలిపారు.
ఇంకా కార్యక్రమాలలో ఆశ్రమ నిర్వాహకులతో పాటు డిడబ్ల్యూ రావఫ్ ఖాన్, అంగన్ వాడి సుపర్ వైజర్ పుష్ప, బిఅర్బి కోఅర్డినేటర్ సుగుణ, డిసిపీఓ కమలాకర్, పిఓఐసి జితేందర్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఉమా, ఆంగన్ వాడి పోషనాబియన్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ తో పాటు తదితరులు పాల్గోన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App