Trinethram News : హైదరాబాద్ జనవరి31
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు.
తుంటికి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు..