ఘనంగా అరకులోయలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజవర్గం, అరకులోయ టౌన్. త్రినేత్రం న్యూస్, డిసెంబర్.22
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్య లింగం. ఆధ్వర్యంలో, అరకులోయ కేంద్రంగా ఉన్న దివంగత నేత డా|| వైఎస్ రాజశేఖర రెడ్డి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అరకు ఎమ్మెల్యే నూతన క్యాంప్ కార్యాలయం ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ,ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన జగన్ ఫోటో కలిగిన ప్రత్యేక కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ ఘనంగా సెలబ్రేషన్ చేసుకొని అరకు ఏరియా హాస్పిటల్లో రోగులకు పల్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే, మాట్లాడుతూ మా ఆహ్వానం మేరకు విచ్చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో.రాష్ట్ర శాసన మండలి సభ్యులు.కుంభ రవిబాబు. విశాఖపట్నం జిల్లా ఛైర్పర్సన్. జల్లిపల్లి సుభద్ర, వైసీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు. పాడేరు మాజీ శాసన సభ్యులు కొట్టాగుల్లి భాగ్యలక్ష్మి. మరియు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.