
Trinethram News : ఏలూరు జిల్లా
జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి
దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు.
వసతి గృహంలో మొత్తం 314 మంది ఉండగా.. 42 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
ఆహారం విషపూరితం కావడం వల్లే సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
