TRINETHRAM NEWS

Financial destruction in KCR Sarkar

Trinethram News : కరీంనగర్: కేసీఆర్ సర్కార్‌లో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. జాతీయ పార్టీ పేరుతో రాష్ట్రాలతో గొడవలు పెట్టుకుందని విమర్శించారు. కేంద్రం నుంచి సరైన నిధులు తేలేక పోయారని మండిపడ్డారు. వాస్తవాలను బీఆర్ఎస్ నేతలు ఇంకా ఒప్పుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఈరోజు(శుక్రవారం) కరీంనగర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… బీఆర్‌ఎస్‌ను వారే కూల్చుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన తప్పులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తాము గులాబీ పార్టీ లాగా గొప్పలకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ధనిక తెలంగాణను గత సర్కార్ అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. రూ. 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాప్, ఇరిగేషన్, కరెంట్‌తో అరాచకాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Financial destruction in KCR Sarkar