శ్రీ తేజ్ బాలుడిని పరామర్శించిన ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 24
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబా నికి అండగా ఉంటామని, తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు
మంగళవారం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను ఆయన పరామర్శించారు. బాధితుడి తండ్రి భాస్కర్ ను ఓదార్చారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమని ఆయన అన్నారు.
రేపు లేదా? ఎల్లుండి సీఎం రేవంత్ ను కలిసి సంధ్య థియేటర్ ఘటనపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని ఆయన వివరించారు. అమెరికా నుంచి రాత్రే తాను హైదరా బాద్ కు వచ్చానని ఇవాళ ఉదయం సీఎం ను కలిశానన్నారు…
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి, సినీ పరిశ్రమ గురించి సీఎంతో చర్చిం చామన్నారు. తొక్కిస లాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేం దుకు ప్రభుత్వం, సిని పరి శ్రమ సిద్దంగా ఉందని, ఆయన వివరించారు.
ఈ బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన చెప్పారు. భాస్కర్ కు ఇంట్రెస్ట్ ఉంటే ఆయనను సినీ పరిశ్రమలో పర్మినెంట్ ఉపాధి కల్పించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App