TRINETHRAM NEWS

Festivals should not be celebrated in such a way as to harm the environment Additional Collector

పెద్దపల్లి. సెప్టెంబర్-6 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా పండుగలు జరుపుకోకూడదని అదనపు కలెక్టర్. జి. శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు.
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ద్వారా ఏర్పాటుచేసిన మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పూర్వకాలంలో పసుపు ముద్దలతో తయారుచేసిన గణపతులను పూజించేవారని, ఆ తరువాత మట్టితో తయారుచేసిన గణపతులను ఇంట్లో పెట్టుకొని పూజించేవారు కానీ ఇప్పుడు రకరకాల రంగులతో రసాయనాలతో కూడిన గణపతులను పూజిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నామని తెలియజేశారు.
కావున ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరారు.
అనంతరం ఆదనపు కలెక్టర్ జె. అరుణ తో కలిసి కార్యాలయ సిబ్బందికి మట్టి గణపతులను అందించారు.
ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఇ. ఇ. బి. బిక్షపతి, ఎ. ఇ. వీరేష్ మరియు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Festivals should not be celebrated in such a way as to harm the environment Additional Collector