అకాల వర్షాలతో పంట నేలకొరిగిన రైతులను ఆదుకోవాలి
Trinethram News : వ్యవసాయ శాఖ కమిషనరేట్లో ఉప సంచాలకులు విజయ్ కుమార్ ని కలిసి వినతి మాత్రం సమర్పించిన బీసీ నేత లింగంగౌడ్
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఆకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన వరి పంట నేలకొరగడంతో ఆరుగాలం శ్రమించిన రైతు కన్నీరు పెట్టుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ వ్యవసాయ శాఖ కమిషనరేట్లో ఉప సంచాలకులు విజయ్ కుమార్ ని కలిసి పత్రం సమర్పించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూపాయలు 30,000 ఇవ్వాలని,వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసుకున్న రైతులకు ఈ అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించిందని అన్నారు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నష్టపోయిన వారి వివరాలు సేకరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App