అర్హులైన వారికే రైతు భరోసా.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
రైతు భరోసా పథకం గురించి అర్హు లైన వారిని గుర్తించేందుకు ఆయా గ్రామాల్లో సర్వే నిర్వహించి గ్రామసభ ఏర్పాటు చేయాలని దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి తెలిపారు మండల కేంద్ర ంలో ఎంపీడీవో కార్యాలయంలో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ఎకరాకు రెండు పంటలకు పదివేల నుండి 12 వేల రూపాయలు ఇస్తుందని తెలిపారు.
రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్ల గురించి రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈనెల 16 నుండి 20 తారీకు వరకు రెవెన్యూ అధికారి మరియు అగ్రికల్చర్ అధికారుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సర్వే నిర్వహించి అర్హులైన వారిని గ్రామసభలో పేర్లు చదివి వినిపిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అంబటి ఆంజనేయులు, ఎంపీడీవో వెంకన్న, మండల వ్యవసాయ అధికారి రెహనా, డిప్యూటీ తహసీల్దార్ రాజ్యానాయక్, సీనియర్ అసిస్టెంట్ ముస్తఫా,ఆర్ ఐ. శ్యామ్నాయక్, ఏఈఓ, పరమేశ్వరి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App