ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల అప్లోడ్ ప్రక్రియను వేగవంతం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం నుండి ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డి లతో కలిసి ప్రజాపాలన లో వచ్చిన ఇండ్ల దరఖాస్తుల యాప్ అప్లోడ్ ప్రక్రియ, వసతి గృహాల్లోని వసతులు, గ్రూప్-2 పరీక్షల నిర్వహణ, వసతి గృహాల్లో డైట్ చార్జీల పెంపు అమలుపై జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ శాఖఅధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిరెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు సూచనలు, సలహాలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. ప్రజపాలనలో ఇండ్ల కోసం వచ్చినదరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నఇందిరమ్మ ఇళ్లు అర్హులైన వారికిఅదేవిధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన తెలిపారు. అధికారులు ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలోపర్యటించి అర్హులైన వారి వివరాలను అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి సంబందిత అధికారులకు సూచించారు. పరీక్షకు హాజరు అయ్యేఅభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనసూచించారు వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం డైట్ చార్జీలపెంచినందున డిసెంబర్ 14 న అన్ని కేంద్రాల్లో కొత్త మెనుతో భోజనాన్ని ప్రారంభించాలని మంత్రి తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పరిగి తహసిల్దార్ కార్యాలయం నుండి గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కలెక్టరేట్ నుండి జిల్లా ఎస్పీనారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్ , అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App