TRINETHRAM NEWS

ఆదివాసులకు ఆధార్ మరియు జనన ధ్రుపత్రాల తప్పనిసరి నుండి మినహాయించండి ఆదివాసి జేఏసీ జిల్లా కన్వీనర్ – రామారావు దొర

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్
ఆదివాసులకు ఆధార్, జనన దృవత్రాల తప్పనిసరి నుండి మినహాయించండి – జిల్లా కలెక్టర్ కు వినతి _ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్ రామరావుదొర విజ్ఞప్తి.

ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసులకు పాఠశాల ప్రవేశాలు, మరియు స్కాలర్షిప్స్ నమోదులకు ఆధార్ తో పాటు జనన దృవపత్రాలు తప్పనిసరి నుండి మినహాయింపు ఇవ్వాలని, SSC మార్క్స్ మెమోను జనన దృవపతరానికి (Birth certificate)కు ప్రామాణికంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్ రామరావు దొర జిల్లా కలెక్టర్ ను కోరారు. జనన ద్రువపత్రం తప్పనిసరి చేయడం వలన ఐదేళ్లు నిండిన బాలబాలికలు పాఠశాల ప్రవేశాలకు, పదవ తరగతి పాస్ అయి ఇంటర్, డిగ్రీ, పీజీ ఆపై చదువులు చదివే వారు స్కాలర్షిప్ ల నమోదు కాక ఆదివాసి విద్యార్థిని, విద్యార్థులు తీవ్రంగ నష్టపోతారన్నారు. ఆసుపత్రులలో పురుడుపోసుకున్న (Institutional deliveries) వారికి మాత్రమే జనన దృవపత్రాలు జారీ అవుతుందని, కనీస రోడ్డు సౌకర్యం కూడా లేని మారుమూల ప్రాంతాల వారు చాలామంది నేటికీ ఇంటి వద్దనే పురుడు (Home delivery) పోసుకుంటున్న వారికి జనన దృపత్రాలు ఉండే అవకాశం లేదన్నారు. ఇదివరకు పడవ తరగతి మార్క్స్ మెమోను జనన ద్రువపత్రంగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ ప్రస్తుతం బడి ఈడు పిల్లలకు పాటశాల ప్రవేశాలకు, స్కాలర్షిప్ నమోదు, ఆధార్ నమోదు/సవరణలకు జనన ధ్రువపత్రం (Birth certificate) తప్పనిసరి చేయడం వలన ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే పాఠశాల రికార్డులో వివరాలు, అదార్ కార్డులో వివరాలు, లోపాలను సరిచేయడానికి అదార్ ఆఫ్ డేటింగ్ సెంటర్లు అందుబాటులో లేక, జనన దృవపత్రాలు తప్పనిసరి చేయడంతో విద్యార్ధిని, విద్యర్హులు తరగతులు మానేసి రోజుల తరబడి ఆధార్ సెంటర్లు, రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారన్నారు. ఇంటర్ ఆపై వారికి, పదవ తరగతి మార్కుల జాబితా, మిగతా వారికి అందుబాటులో ఉన్న ఎదోఒక దృవపతరాన్ని, ప్రమానికంగా తీసుకోవాలని కోరారు. ఆశ్రమాల్లో చదివే పిల్లలకు పాఠశాలలోనే ఆధార్ అప్దేటింగ్ చేయాలనీ, అలకుదరని యెడల ప్రతి మండలానికి రెండేసి ప్రత్యేక కేంద్రాలు తెరిచి త్వరగా పూర్తిచేయాలనీ రామారావు దొర కోరారు. అలా చేయని పక్షంలో భారత రాజ్యాంగం ప్రాధమిక హక్కుగా పొందవలసి విద్యను ఆదివాసి బాలలు కోల్పోవలసి ఉంటుందని, తన ఆవేదనను మీడియా ముందు వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జెఎసి పాడేరు మండల కన్వీనర్ తామరి సురేష్ బాబు, జిల్లా ప్రతినిదులు కుర్తాడి తెల్లబాబు, బోయిని నాగరాజు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App