Excavation of soil against rules in Manthani
చూసి చూడనట్లు వ్యవరిస్తున్న సంబంధిత అధికారులు
మంథని మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంథని మండలం బిట్టుపల్లి గ్రామ పరిధిలోని పెద్ద చెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ విలువైన మట్టిని తరలించేందుకు కాంట్రాక్టర్ లకు అనుమతులు ఇస్తున్నారు.మట్టిని తరలింపు లో సమయ పాలన పాటించకుండా రాత్రి సమయంలో కూడా ట్రిప్పర్లతో మట్టిని చేరవేస్తున్నారు.ట్రిప్పర్ల కు టార్ఫిన్ కవర్ లు కప్పకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్ళ్తున్నారు.అధిక లోడ్ తో వచ్చే మట్టి లారీల వలన ఈ మధ్య కాలంలో వేసిన ఫోర్ వే లైన్ దెబ్బ తింటుంది.
ఆర్ అండ్ బి అధికారులు చూసి చూడనట్లు వ్యవరిస్తున్నారు.డ్రైవర్లు మధ్యము సేవించి ఓవర్ స్పీడ్ తో నడుపుతున్నారు.దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఐబీ అధికారులు రోజు వారీగా మట్టిని క్యూబిక్ మీటర్లల్లో కొలతలు తిసుకోవడం లేదు. కాంట్రాక్టర్ లు పెద్ద మొత్తంలో మట్టిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రైతుల పొలంలో తట్టేడు మట్టిని ఇవ్వడానికి దైర్యం రాని అధికారులు వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించి కాంట్రాక్టర్ ల జేబులు నింపటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి పై విషయం పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App