
సనాతన ధర్మం అంటూ మాజీ ఎమ్మెల్యే, చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం చిన్న పాలమూరు, సనాతనధర్మం గురించి మాట్లాడే మాజీ ఎమ్మెల్యే,కి ఆయన ఎమ్మెల్యే,గా ఉండగా కొత్తూరు గ్రామంలో నిర్మించిన ఆలయానికి అనుమతులు తీసుకుని ఆలయం నిర్మించాలనే విషయం తెలియదా?
ఎమ్మెల్యే,గా చేసిన వ్యక్తికి గుడి నిర్మాణం అనుమతులతో నిర్మించాలని తెలియకపోవడం హాస్యాస్పదం కాదా?
గుడి పేరుతో ఊరుని రెండు ముక్కలు చేసిన మాజీ ఎమ్మెల్యే సనాతన ధర్మం గురించి ఏ విధంగా మాట్లాడతారు?:టిడిపి నాయకులు కొశెట్టి శ్రీనివాస్
చినపొలమూరు గ్రామంలో వెనుక కనబడే గుడి మాజీ ఎమ్మెల్యే, సూర్యనారాయణరెడ్డి, హయాంలో నిర్మించడం జరిగింది. 70 యేళ్ళ నాటి ఆలయం శిధిలమైన పక్షంలో గ్రామస్ధులందరూ ఏకమై అన్నదమ్ముల వలె కలసిమెలసి ఆలయం పునర్మించుకోవాలని సంకల్పించి చందాలు ప్రోగుచేసి నిర్మాణం జరిపించుకోవడం జరిగింది. ఈ క్రమంలో విగ్రహాల ఏర్పాటుకి నేను ముందుకి వచ్చి అందరి ఆమోదం పొంది వివిధ ప్రాంతాలు తిరిగి చివరికి చెన్నైలో తయారు చేయించడం జరిగింది.
తయారు చేయించిన విగ్రహాలను అక్కడి నుండి తీసుకువస్తూ అనపర్తి నల్లకాలువ వంతెన వద్దకు గ్రామస్దులు ఎదురొచ్చి స్నానాలు చేసి భజనలు చేస్తూ అమ్మవారికి పసుపు నీరు చల్లుతూ ఊరేగింపుగా తీసుకువచ్చి ధాన్యపు గదిలో అమ్మవారి విగ్రహాలను పెట్టడం జరిగింది.
ఆరోజు నేను టిడిపి సానుభూతిపరుడుననే కక్షతో నేను తెచ్చిన విగ్రహాలు పెట్టడం ఏమిటని రాజకీయాలు చేసిన మహానుభావుడు ఈ మాజీ ఎమ్మెల్యే,
ఆరోజు అందరం ఈ విషయం గురించి వారి దగ్గరకు వెళ్ళగా ఆయన నన్ను చూడగానే రెచ్చిపోయి మందుత్రాగిన వాడిలా ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడటం జరిగింది.
అంతేకాకుండా రెండు నెలలు పూజలు జరిగి ధాన్యంలో పెట్టిన విగ్రహాలను ఎట్టిపరిస్దితులలోనూ పెట్టడం జరగదు అని తేల్చి చెప్పారు నాడు మాజీ ఎమ్మెల్యే,
నేడు సనాతన ధర్మం గురించి బుద్దులు చెప్పే ఆయన ఆనాడు పూజలు జరిగిన విగ్రహాలను ప్రక్కనబెట్టేసి రెడీమేడ్ విగ్రహాలను తెప్పించి ఎటువంటి పూజలు జరిపించకుండా పోలీసు బందోబస్తు పెట్టి గ్రామాన్ని భయబ్రాంతులకు గురిచేసి విగ్రహాలను పెట్టించడం జరిగింది.
ఆరోజు ఆయనకు సనాతన ధర్మం ఆయనకు గుర్తుకు రాలేదా? హిందూత్వం మరచిపోయారా? సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉందా?
మా గ్రామాన్ని నాడు రెండు ముక్కలు చేసిన మీకు నేడు కొత్తూరు అంశంలో సనాతన ధర్మం గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది సూర్యనారాయణరెడ్డి, అసలు ఆయల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం మీకు తెలియకపోవడం అంతే విడ్డూరంగా ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
