
Trinethram News : వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని BRS భవన్ జిల్లా BRS పార్టీ కార్యాలయం లో నిర్వహించిన వికారాబాద్ పట్టణ BRS పార్టీ నాయకుల & కార్యకర్తల అంతర్గత సమావేశానికి హాజరైన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.
సమావేశంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని వార్డుల వారిగా BRS పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు మాజీ కౌన్సిలర్ గోపాల్ ముదిరాజ్ వికారాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు గా, సుభాన్ రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షులు గా మరియు గాండ్ల మల్లికార్జున్ ని జనరల్ సెక్రెటరీ గా నియమించారు.
ఈ సందర్భంగా నూతనంగా నియమితులైనవారికి జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు ఒక కుటుంబం మాదిరిగా ముందుకు సాగాలని, పట్టణ మరియు మండల నాయకులు సంయుక్తంగా పనిచేసి BRS పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో BC కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, రమేష్ గౌడ్, కృష్ణ రెడ్డి, లక్ష్మణ్, రాములు, గంగారం BR శేఖర్, PACS వైస్ చైర్మన్ పాండు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వికారాబాద్ మండల అధ్యక్షులు నారెగూడెం మహిపాల్ రెడ్డి
, కార్య నిర్వాహక అధ్యక్షులు పడిగళ్ళ అశోక్, సీనియర్ నాయకులు దేవదాసు, R. మల్లేశం నాయకులు రమణ, అనంతయ్య, సురేష్ గౌడ్, రాజేందర్ గౌడ్, షఫీ వికారాబాద్ పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షులు ముర్తుజా ఆలీ, వికారాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షులు గిరీష్ కొఠారి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
