రామగుండం ప్రాంతము లో అందరూ లేబర్ కార్డు నమోదు చేసుకోవాలి
లేబర్ కార్డుతో కార్మిక వర్గానికి ఎంతగానో ప్రయోజనం
అసంఘటిత కార్మిక సంఘం నాయకులు శనగల శ్రీనివాస్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
33 వ డివిజన్ మజీద్ దగ్గర భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్డులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అసంఘటిత కార్మిక సంఘం నాయకులు శనిగల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ
గోదావరిఖని రామగుండం లో భవన, నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కు ప్రభుత్వం అందిస్తున్న లేబర్ గుర్తింపు కార్డులు కుటుంబాల్లో ధీమాను కల్పిస్తున్నాయి. కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం అ పథకాన్ని అమలుచేస్తోంది. 18 నుంచి 60ఏళ్ల వయస్సు కలిగిన భవన నిర్మాణ కార్మికులు అర్హులవుతారు. ఈ చట్టం కింద ఇప్పటి వరకు అనేక మంది భవన నిర్మాణ కార్మికులుగా నమోదయ్యారు. ఇందులో పురు షులు మహిళలు అనేక మంది ఉన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈ కార్డులు కార్మికులకు తప్పని సరి. తాపిమేస్త్రీలు, వండ్రంగి, వెల్డిం గ్, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు, టైల్స్, వడ్డెర లు, ఇతర నిర్మాణాలలో పనిచేసే కార్మికులకు లేబర్ కార్డులను కార్మిక శాఖ ద్వారా జారీ చేస్తున్నారు. 1996 లో ఈ చట్టం అమల్లోకి రాగా, ప్రసూతి సహాయం కింద అనేక మందికి, ప్రమాదం, అనారోగ్యం బారిన పడి తాత్కాలిక చికిత్సకు అనేక మందికి రూ.13,500 చొప్పు న అందించారు. ప్రమాదవశాత్తు మరణించిన ఆనేక మంది కార్మిక కుటుంబాలకు రూ. 6.30లక్షల చొప్పున అందిం చారు. అర్హులైన ప్రతీ కార్మికు డు తప్పకుండా లేబర్ కార్డు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కార్డుఉంటే ధీమా ఉండొచ్చని పేర్కొంటున్నారు.
లేబర్కార్డులున్న వారి పిల్లల వివాహ కానుకగా రూ. 30 వేలు, ప్రసవం కింద రూ. 30వేలు అందిస్తారు. కార్మికుడికి ఇద్దరు కుమార్తెలుంటే ఒక్కొక్కరికి రెండు కాన్పుల వరకు వర్తిస్తుంది. సాధారణ మరణంకు రూ. 1.30 లక్షలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 6.30 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం వల్ల అంగవైకల్యం కలిగితే దాని ఆధారంగా పరిహారం అందజేస్తారు లేబర్ కార్డు పొందాలనుకునే వారు కార్మికులు పనిచేసే ఫొటో, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంక్ ఖాతా బుక్, ఫోన్ నంబరు, కుటుంబ సభ్యులు, చేసే పని వివరాలకు సంబంధించిన ఫారాన్ని నింపి మీసేవలో దరఖాస్తు చేయాలి.
ఆధార్‌నమోదు తర్వాత వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్వాహకుడికి రూ.110 చెల్లించాలి. దరఖాస్తు ఫారాలను జిల్లా కార్మికశాఖ కార్యాలయంలో అందజేస్తే, వాటిని పరిశీలలించి అర్హుడిగా తేలితే కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డులు ఐదేళ్ల వరకు పనిచేస్తుంది. నిర్ణీత సమయంలో రెన్యూవల్ చేయించుకోవాలని పిలుపు ఇచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు రమేష్, రాజు, రియాజ్, ఎండి ఖా, పురుషోత్తం, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App