సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు … అన్న క్యాంటీన్ వద్ద ఘనంగా మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు
Trinethram News : రాజమహేంద్రవరం :సమాజసేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో సుమారు 500 మందికి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మజ్జి రాంబాబుతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్లో పేదలకు అన్నప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయని, ఆ సందర్భంగా సమాజానికి, పేదలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని పిలుపునిచ్చారు. పుట్టిన రోజు సందర్భంగా మజ్జి రాంబాబు చేపట్టిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ తన పుట్టినరోజును పేదల మధ్య నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
పేదలకు అన్నదానం చేయడం తనకు మహదానందాన్ని కలిగించిందన్నారు. గత వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటిన్లను మూయించి పేదల ఆకలి కడుపులపై కొట్టిందని, అయితే తన నాయకులు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో క్వారీ సెంటర్లోను, నగరంలో అనేక ప్రాంతాల్లో మొబైల్ అన్న క్యాంటిన్లను నిర్వహించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ అన్న క్యాంటిన్లను ప్రారంభించడంతో పేదలు చాలా సంతోషించారని తెలిపారు.
ఆ అన్న క్యాంటిన్లో తన పేరిట అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, టీఎన్టియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య, రాజమండ్రి పార్లమెంట్ మహిళ కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App